sbi online investment plan

SBI Online Investment Plan-ఎస్బిఐ లో బ్యాంకు కి వెళ్ళకుండానే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా

sbi online investment plan-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ బ్యాంకుల్లో ఒకటి ,ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ మేనేజ్మెంట్ అనుగుణంగా రూపొందించబడిన అనేక రకాల ఆన్లైన్ పెట్టుబడి ప్రణాళికలను అందిస్తుంది. ఎస్బిఐ స్వల్పకాలిక లాభాలు మరియు దీర్ఘకాలిక సంపద దృష్టి రెండింటికి పెట్టుబడులను ప్రణాళికలను అందిస్తుంది. కస్టమర్ వారి పోర్ట్ఫోలియోను మెరుగుపరచడానికి వృద్ధి చేసుకోవడానికి వీలు కల్పిస్తోంది.

1. SBI మ్యూచువల్ ఫండ్స్ :

ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్స్ ప్రొఫెషనల్గా నిర్వహించబడతాయి. పెట్టుబడిదారులకు విభిన్న పెట్టుబడి పోర్ట్ఫోలియో ద్వారా రాబడిని పొందే అవకాశాన్ని అందిస్తాయి. ఈ ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్స్ లో మన రిస్క్, రాబడిని బట్టి కొన్ని రకాలు ఫండ్స్ ఉన్నాయి.ఇవి అన్ని ఫండ్ మేనేజర్ చే నిర్వహించబడతాయి.

ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్స్ రకాలు

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాల్లోని కంపెనీలు స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్స్ అధిక రాబడిని అందించగలవు అయితే అదే విధంగా ఎక్కువ నష్టాన్ని కూడా కలిగి ఉంటాయి .

డెడ్ మ్యూచువల్ ఫండ్స్:ఈ ఫండ్స్ ప్రభుత్వ బాండ్లు వంటి వాటిలో పెట్టుబడి పెడతాయి ఒక స్థిర ఆదాయం సెక్యూరిటీతో పెట్టుబడి పెడతాయి దీనిలో తక్కువ రిస్కు మరియు స్థిరమైన రాబడిని అందిస్తాయి.

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్:ఈక్విటీ మరియు డెడ్ పండ్ల సమ్మేళనం కలిగి ఉంటాయి ఒక పరిమితి రిస్కు తీసుకునేవారికి ఇవి ఉపయోగపడతాయి.

ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి :

ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్స్ ను ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు .

2. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ :

ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ మరియు రాబడిని రెండింటిని అందించే వివిధ పెట్టుబడి అనుసంధాన బీమా పాలసీలను అందిస్తుంది. వీటిని యూనిట్ లిక్విడ్ ఇన్సూరెన్స్ ప్లానర్ (ulip) ప్లాన్ అని పిలుస్తారు .మరియు జీవిత బీమాను పెట్టుబడితో కలుపుతారు .

ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లోని రకాలు:

వెల్త్ క్రియేషన్ ప్లాన్స్: జీవిత బీమా కవరేజ్ ని పొందుతూ కాలక్రమేణ సంపదను కూడ పెంచుకోవాలని చూస్తున్న వారి కోసం ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

రిటైర్మెంట్ ప్లాన్స్ : ప్రత్యేకించి పదవి విరమణ పొదుపు కోసం ఉద్దేశించబడింది .పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది .

చైల్డ్ ప్లాన్:తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా మరియు భవిష్యత్తు అవసరాల కోసం కార్పస్ ను రూపొందించడానికి సహాయపడుతుంది .

ముఖ్య ప్రయోజనాలు:

భీమా మరియు పెట్టుబడి యొక్క ప్రయోజనలు రెండు అందిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80c క్రింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా నిధులను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.

ఎలా పెట్టుబడి పెట్టాలి :

ఈ ప్లాన్ లను ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు.

3. SBI ఫిక్స్డ్ డిపాజిట్లు:

ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిలో ఒకటి, రిస్క్ లేని పెట్టుబడి హామీ ఇవ్వబడిన రాబడులను అందిస్తాయి. ఇవి ఫ్లెక్సిబుల్ టెన్యూర్ ను కలిగి ఉంటాయి ఎస్బిఐ ఎఫ్డి లను ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయవచ్చు రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. SBI ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మరింత తెలుసుకోవడానికి

ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్ లో రకాలు:

రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ :ఫ్లెక్సిబుల్ టెన్యూర్ స్థిరమైన వడ్డీ రేట్లు అందిస్తుంది.

ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డిపాజిట్: సెక్షన్ 80 c ఫండ్ మినహాయింపును అందిస్తుంది. ఐదు సంవత్సరాల లాకిన్ వ్యవధిని కలిగి ఉంటుంది .

ఎస్బిఐ మల్టీ ఆప్షన్ స్కీం (MODS): డిపాజిట్ ను బ్రేక్ చేయకుండా పాక్షిక విత్ డ్రా అవకాశం కలిగి ఉంటుంది .

ముఖ్య ప్రయోజనాలు

పెట్టుబడిపై ఖచ్చితమైన వడ్డీ కలిగి ఉంటుంది టెన్యూర్ ఆప్షన్స్ లో ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు మార్చుకునే అవకాశం ఉంటుంది .పన్ను ఆదా మరియు సౌకర్యవంతమైన విత్ డ్రా కలిగి ఉంటాయి.

ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా పెట్టుబడి పెట్టాలి : మీరు sbi నెట్ బ్యాంకింగ్ పోర్టల్ లేదా యోనో(yono) యాప్ ద్వారా ఎఫ్డి ఖాతాను తెరవవచ్చు ఇక్కడ మీరు అన్నిFD సంబంధిత లావాదేవీలను నిర్వహించవచ్చు.

4.SBI రికరింగ్ డిపాజిట్ (RD)

పెద్దమొత్తంలో వన్ టైం డిపాజిట్ కంటే నెల నెల చిన్న మొత్తాల్లో పొదుపులో ఇష్టపడే వారికి ఎస్బిఐ యొక్క రికరింగ్ డిపాజిట్ ఉపయోగపడుతుంది ఇది ఆరు నెలలకు ఒకసారి వడ్డీని అసలు లో జమ చేస్తుంది.

ముఖ్య ప్రయోజనాలు: ఆరునెలల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ కలిగి ఉంటుంది .ఈ అకౌంట్ తెరవడానికి కనీస డిపాజిట్ సరిపోతుంది.

ఎలా పెట్టుబడి పెట్టాలి :ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్ లేదా యోనో(YONO) యాప్ ద్వారా RD ఖాతాను తెరవవచ్చు, మీరు మీ సేవింగ్స్ అకౌంట్ నుండి నెలవారీ ఆటో పే చేసుకోవచ్చు.


sbi online investment plan

5. SBI సావరిన్ గోల్డ్ బాండ్

ఎస్బిఐ కూడా భారత ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ బంగారంలో పెట్టుబడిని పెట్టుకోవచ్చు. ఇది భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అదేవిధంగా ఆ గోల్డ్ బాండ్స్ పై వడ్డీని పొందే అవకాశం ఉంది.

ముఖ్య ప్రయోజనాలు :

బంగారం మార్కెట్ ధర ఆధారంగా క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది అదేవిధంగా మనం పెట్టుబడి పెట్టిన బంగారంపై అదనపు వడ్డీ ఇస్తారు .ఇది భౌతిక బంగారం బలే భద్రత గురించి ఆలోచించవలసిన అవసరం లేదు.

ఎలా పెట్టుబడి పెట్టాలి : ఎస్బిఐ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ బాండ్లను ఓపెన్ చేసినప్పుడు ఎస్బిఐ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

6.ఎస్బిఐ నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)

నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ప్రభుత్వ మద్దతు గల పదవీ విరమణ ప్రణాళిక వారి పదవీ విరమణ కోసం పొదుపు చేయాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఎస్బిఐ ఆన్లైన్ లో NPS ఖాతాను సులభతరం చేస్తుంది. రిటైర్మెంట్ కార్పస్ ను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది .ప్రయోజనాలు పదవీ విరమణ తర్వాత రెగ్యులర్ పెన్షన్ను అందిస్తుంది .సెక్షన్ 80c మరియు 80ccd కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు .

ఎలా పెట్టుబడి పెట్టాలి : మీరు ఆన్లైన్లోనే SBI లో NPS ఖాతాను తెరవవచ్చు.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *