నో కాస్ట్ EMI అంటే ఏమిటి? వడ్డీ రేటు లెక్కింపు మరియు ఇది ఎలా పని చేస్తుంది?
కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, లేదా వాషింగ్ మెషీన్ లాంటి పెద్ద పరికరాలు కొనుగోలు చేయడానికి ఇప్పుడు మనకు EMI(No Cost EMI) పద్ధతి అందుబాటులో ఉంది. కానీ, సాధారణ EMI పద్ధతిలో వడ్డీ ఉంటుంది, నో కాస్ట్ EMI (No Cost EMI) పద్ధతిలో ఈ వడ్డీ లేకుండా సులభంగా గాడ్జెట్‌లు లేదా పరికరాలను కొనుగోలు చేయొచ్చు. ఈ పద్ధతి ద్వారా కస్టమర్లు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా, కేవలం వస్తువు అసలు ధరను EMIలోచెల్లిస్తారు.
ఇప్పుడు మనం ఈ నో కాస్ట్ EMI పద్ధతి ఎలా పనిచేస్తుందో, దీని వడ్డీ రేటు ఎలా ఉంటుందో, అలాగే దీని ప్రయోజనాలను ఏమిటో తెలుసుకుందాం.
నో కాస్ట్ EMI అంటే ఏమిటి?-what is no cost emi
నో కాస్ట్ EMI అంటే (no cost emi means)అసలు వస్తువు ధరను చిన్న చిన్న భాగాలుగా (EMI) చెల్లించడంలో ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా చెల్లించే EMI పద్ధతిని సూచిస్తుంది. సాధారణంగా, ఈ పద్ధతిలో వినియోగదారులు క్రెడిట్ కార్డ్ లేదా ఫైనాన్స్ సంస్థల ద్వారా చిన్న మొత్తాలలో EMI చెల్లిస్తారు, కానీ వారికి ఎటువంటి వడ్డీ చార్జీలు ఉండవు.
నో కాస్ట్ EMI ఎలా పని చేస్తుంది?
1. అసలు ధర EMIగా మారడం
నో కాస్ట్ EMI పద్ధతిలో, కస్టమర్ వస్తువు అసలు ధరను EMI పద్ధతిలో చెల్లిస్తారు. ఉదాహరణకు, ఒక ఫోన్ ధర రూ. 20,000 ఉంటే, మీరు సాధారణంగా దీన్ని ఒక్కసారిగా చెల్లించాలి. కానీ, నో కాస్ట్ EMI ద్వారా మీరు ఈ మొత్తం మొత్తాన్ని నెలవారీ చెల్లింపులుగా చేయవచ్చు.
2. వడ్డీ రేటును వ్యాపారి లేదా ఫైనాన్స్ సంస్థలు భరిస్తాయి
సాధారణంగా, ఏదైనా EMIకి వడ్డీ ఉంటుంది. అయితే, నో కాస్ట్ EMI పద్దతిలో వ్యాపారి లేదా ఫైనాన్స్ సంస్థ ఈ వడ్డీని మాఫీ చేసి కస్టమర్‌కి ఎటువంటి వడ్డీ లేకుండా EMIలుమాత్రమే పే చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఈ పద్దతిలో వ్యాపారి నేరుగా వడ్డీ రుసుమును భరిస్తారు లేదా క్యాష్ బ్యాక్ రూపంలో కస్టమర్‌కు తిరిగి ఇస్తారు.
3. క్రెడిట్ కార్డ్ లేదా ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం
నో కాస్ట్ EMI సదుపాయాన్ని చాలా ఆన్‌లైన్ స్టోర్లు, రిటైల్ స్టోర్లు క్రెడిట్ కార్డ్ కంపెనీలు , ఫైనాన్స్ సంస్థలతో కలిసిపనిచేస్తున్నాయి. వినియోగదారులు ఫైనాన్స్ కంపెనీ లేదా బ్యాంక్ ద్వారా వారి క్రెడిట్ కార్డ్ లేదా ఫైనాన్స్ సదుపాయం ద్వారా ఈ EMI పద్దతిని తీసుకోవచ్చు.

వడ్డీ రేటు లెక్కింపు – ఉదాహరణతో వివరంగా
ఉత్పత్తి ధర: రూ. 20,000
సాధారణ EMIలో 10% వడ్డీతో మీరు రూ. 22,000 చెల్లించవలసి ఉంటుంది. అంటే, మొత్తం రూ. 2,000 అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, నో కాస్ట్ EMI పద్దతిలో కస్టమర్ నుండి ఎటువంటి వడ్డీ తీసుకోరు. దీని వల్ల మీ నెలసరి EMIలు తక్కువవుతాయి.
నో కాస్ట్ EMI calculation-(no cost emi calculator)
- ఉత్పత్తి అసలు ధర: రూ. 20,000
- నెలవారీ EMI: రూ. 20,000 / 10 నెలలు = రూ. 2,000
ఇక్కడ, కస్టమర్ వడ్డీ లేకుండా ప్రతి నెలా ఒకే స్థిరమైన మొత్తం చెల్లించవచ్చు, అనగా కేవలం అసలు ధరను EMI రూపంలో చెల్లిస్తారు.

నో కాస్ట్ EMI ప్రయోజనాలు-no cost emi uses
- పెట్టుబడి తగ్గించడం: ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా, చిన్న మొత్తాలలో EMIలలో చెల్లించవచ్చు.
- వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకపోవడం: సాధారణ EMIలు వడ్డీతో వస్తాయి కానీ, నో కాస్ట్ EMI పద్దతిలో కేవలం అసలు ధరనే EMI పద్ధతిలో చెల్లించవచ్చు.
- సులభ EMIలు: వినియోగదారుల కోసం సులభంగా సుమారు 3 నుంచి 12 నెలల వరకు EMIలు పొందడానికి అవకాశం ఉంది.
నో కాస్ట్ EMI లో కొనుగోలు చేయగలిగిన వస్తువులు
- ఎలక్ట్రానిక్స్: ఫోన్, ల్యాప్‌టాప్, టీవీలు వంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు.
- హోం అప్లయెన్సెస్: వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, మైక్రోవేవ్.
- ఫర్నిచర్: పెద్ద మొత్తంలో ఫర్నిచర్ కొనుగోలు చేస్తే ఈ పద్దతి ఉపయోగపడుతుంది.
ఎవరికీ ఉపయోగపడుతుంది?
- budget-conscious shoppers: ఒకేసారి మొత్తం ధనాన్ని ఖర్చు చేయడం వీలుకాని వారు.
- వడ్డీ లేని సౌకర్యం పొందాలనుకునే వారు: ఒకే సమయంలో పెద్ద మొత్తంలో EMIలు పడకుండా , వడ్డీ లేకుండా EMIలు పొందే అవకాశం.
నో కాస్ట్ EMI పద్దతి తక్కువ ఖర్చుతో, తక్కువ వడ్డీతో మనకు ఇష్టమైన వస్తువులను EMIలో కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.